తనతో పాటు తన కుటుంబ సభ్యులెవ్వరూ లిక్కర్, గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారాలు చేయడం లేదని.. వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ప్రభుత్వ విప్, జగ్గయ్య పేట వైకాపా ఎమ్మెల్యే (MLA) సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక, ధైర్యంగా ఎదుర్కొలేకే తెదేపా ఆరోపనలు చేస్తోందని అన్నారు. నల్గొండ జ్లిల్లాలో గంజాయి(GANJAI) పట్టుబడితే తన కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారని సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫోరెన్సిక్ పరీక్ష సహా, నార్కో అనాలసిస్ పరీక్షకూ తాను సిద్దమన్నారు. అనవసరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న ఆయన.. న్యాయస్థానాల్లో పరువు నష్టం దావా వేస్తామన్నారు. తన నియోజకవర్గంలో ఇసుక, లిక్కర్ మాఫియా ఎక్కడా లేదన్న ఉదయ భాను.. తను ఎలాంటి విచారణకైనా సిద్దమని,..దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.