లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు విజయవాడకు చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాలు ముందుకొచ్చాయి. ఆయా సంస్థలు చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా వైకాపా నాయకులు పాల్గొని...కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైకాపా నేతలు పాల్గొనడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి...గుంపులుగా తిరుగుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి