ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్థంతి కార్యక్రమాన్ని విజయవాడలో మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని కీర్తించారు.
పొట్టి శ్రీరాములు సాధించిపెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అక్రమ కేసులు బనాయిస్తుందని మహేశ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం త్వరలోనే పతనం అవుతుందని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి : రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారు: చంద్రబాబు