తెదేపా బలహీనవర్గాల పార్టీ అనేది మరోసారి రుజువైందని పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత యనమల అన్నారు. టీమ్ స్పిరిట్‌తో నూతన కమిటీ పని చేయాలని.. అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. తెదేపాపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైకాపా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.
ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి అధికారం పొందిన వైకాపా అనేక అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. బీసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు - దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యిందని తెలిపారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: