కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. సమస్యలను పరిష్కరించే దిశగా లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాలను రాష్ట్రాల మీద రుద్దే ప్రయత్నమే చేస్తోందని.....అలా అయితే రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకమేనని అన్నారు. నూతన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఊసే లేదన్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు....అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం చేయూత చాలా అవసరమున్నా.. బడ్జెట్లో ప్రస్థావించలేదన్నారు. అధికారంలో ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిందేనని....గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసిందని యనమల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి పోరాటాలు చేస్తుందో వేచి చూడాలన్నారు.
ఇదీ చదవండీ :