'తనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసులతో కేంద్రానికి లొంగి మోకాళ్ల బేరానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మెడవంచి మోకాళ్ల నమస్కారాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావటం చేతకాదని నిస్సహాయంగా చేతులెత్తేసిన జగన్ రెడ్డి ప్రజల్ని దగా చేశారు. కేంద్రంతో జగన్ రెడ్డి ములాఖత్ వల్ల యువతకు నష్టం, రాష్ట్రానికి తీరని చేటు వాటిల్లింది. 2020-21లో పారిశ్రామిక వృద్ది మైనస్ 3.2శాతానికి, ఆర్థికాభివృద్ధి వాటాశాతం 20 శాతం దిగువకు పతనమైంది. నిరుద్యోగరేటు ఇప్పటికే 13.5శాతానికి పెరిగిపోయింది. జగన్ లొంగుబాటు యువత భవిష్యత్‌కు అంధకారమై, రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది. ప్రత్యేక హోదా సాధనలో జగన్ వైఫల్యం వల్లే పారిశ్రామికాభివృద్ది తిరోగమనంలో పయనిస్తోంది' అని యనమల విమర్శించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలేమీ లేక ఏ పరిశ్రమా రాష్ట్రానికి రావట్లేదు. భావితరాలకు ఉపాధి లేక నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది. రాయితీలు అందక, పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. పారిశ్రామిక వృద్ధిరేటు మందగించి ఆర్థికాభివృద్ధి రేటు తిరోగమిస్తుండటంతో రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో 26 మంది వైకాపా ఎంపీలు ఉండి కూడా హోదా సాధించడంలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని దిష్టిబొమ్మల్లాంటి ఎంపీలతో రాష్ట్రానికి ఏ ఉపయోగమూ లేదు. చేతకాని వైకాపా ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలి.
- యనమల రామకృష్ణుడు
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లు.. లింగనిష్పత్తిలో దేశంలో ఏపీది 16వ స్థానం!