ETV Bharat / city

ప్రశాంత గోదావరి జిల్లాలను అల్లకల్లోలం చేస్తున్నారు: యనమల - జగన్​పై యనమల కామెంట్స్

ప్రశాంతమైన గోదావరి జిల్లాలను అల్లకల్లోలం చేస్తున్నారని తెదేపా నేత యనమల మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌కు యనమల లేఖ రాశారు. దివిస్ పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించి...నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ఆర్థికసాయం చేయాలని లేఖలో కోరారు.

ప్రశాంత గోదావరి జిల్లాలను అల్లకల్లోలం చేస్తున్నారు

author img

By

Published : Dec 19, 2020, 3:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. వందల మంది పోలీసులతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమలతో మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందన్నారు. తెదేపా సహా ప్రతిపక్షాల హెచ్చరికలను బేఖాతరు చేయడం గర్హనీయమని ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం అప్రజాస్వామికమన్నారు.

పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దమనకాండతో జగన్‌ ఇప్పటికే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. అన్ని జిల్లాల్లో అశాంతి, అభద్రతతో నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని తయారు చేశారన్నారు. జంగిల్ రాజ్​​గా, పోలీస్ రాజ్​గా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర పరిస్థితులు ప్రజాస్వామ్యవాదులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఇకనైనా చేసిన తప్పులను సరి దిద్దుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని యనమల హితవు పలికారు.

ప్రశాంతమైన గోదావరి జిల్లాలను అల్లకల్లోలం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. ఇకనైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి...మత్స్యకారులు, మహిళలపై అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని సూచించారు. దివిస్ పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించి...నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ఆర్థికసాయం చేయాలని లేఖలో కోరారు.

ఇదీచదవండి

'దివిస్' ఘటనలో 160 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.