సీఎం జగన్ పథకాలన్నీ మాయలేనని యనమల విమర్శించారు. ఏడాదిలోనే జగన్మాయ నుంచి జనం బయటపడ్డారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ స్కీమ్లు రద్దు చేసి జగన్ తెచ్చింది మాయ పథకాలేనని మండిపడ్డారు. వైకాపా చేతగాని పాలనతో రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయని... బీసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమాన్ని కాలరాసి వారి కొనుగోలు శక్తిని దెబ్బతీశారని ఆరోపించారు. గత 14 నెలల్లో 18 వేల 26 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను రద్దు చేశారని యనమల విమర్శించారు. స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 10శాతం కోత పెట్టి 34శాతం నుంచి 24 శాతానికి తగ్గించేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సున్నా వడ్డీకి ఏదీ అండ?.. వాణిజ్య బ్యాంకుల మోకాలడ్డు