లైసెన్స్ లేకుండా ఐఎస్ఐ, హాల్ మార్క్ ముద్రలు వేసి వస్తువులు విక్రయించే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏపీ హెడ్ వినోద్ అన్నారు. సంబంధిత దుకాణాలకు హాల్ మార్క్ , ఐఎస్ఐ ముద్రలు వేసే లైసెన్స్ ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నారు.
ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆన్ లైన్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని పేర్కొన్నారు. వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యతా ప్రమాణాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారం విజయవాడ ఎంజీ రోడ్లో స్టాండర్డ్ వాక్ పేరుతో 2కె నడక నిర్వహించనున్నట్లు వినోద్ వెల్లడించారు.
ఇవీ చదవండి: