ETV Bharat / city

Womens Power: అంతా ఒక్కటయ్యారు.. రైల్వేస్టేషన్​ రూపురేఖలు మార్చేశారు - మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలు

కొన్నేళ్ల క్రితం అది పేరుకే ఓ రైల్వేస్టేషన్‌.! కానీ... ఇప్పుడు పేరెన్నిక గల స్టేషన్‌.! పోకిరీలు, తాగుబోతుల బెడదతో విధి నిర్వహణకూ సిబ్బంది భయపడ్డారు. నాలుగేళ్లు తిరిగేసరికి అదే రైల్వేస్టేషన్‌ అత్యుత్తమంగా నిలిచింది. దీనికి కర్త, కర్మ, క్రియా అంతా అతివలే..! పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడుస్తున్న ఆ రైల్వేస్టేషన్​ను చూసొద్దాం రండి.

women employees at Ramavarappadu railway station
రామవరప్పాడు రైల్వేషన్​లో మహిళా సిబ్బంది
author img

By

Published : Mar 8, 2022, 8:22 AM IST

రామవరప్పాడు రైల్వేషన్​లో మహిళా సిబ్బంది

Ramavarappadu Railway Station: విజయవాడ సమీపంలోని రామవరప్పాడు రైల్వేస్టేషన్‌... కొన్నేళ్ల క్రితం వరకు ఇక్కడ సౌకర్యాలు లేక ప్రయాణికులు జంకేవారు. రాత్రి వేళ్లలో దోపిడీ దొంగలు, తాగుబోతులు, పోకిరీల చేష్టలతో.. ఒంటరిగా అటు వైపు వెళ్లాలంటేనే భయపడేవారు. ఇదంతా గతం.! 2016 లో కృష్ణా పుష్కరాల రాకతో దీనిని.. శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌గా రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్వహణను నారీమణుల చేతులకు అప్పగించింది. మేనేజర్‌ సహా నిర్వహణ మొత్తాన్నీ.. మహిళా సిబ్బందే చూసుకుంటున్నారు. తొలుత విధులు నిర్వహించేందుకు.. వెనకడుగు వేశారు. ఎక్కడికో ఉద్యోగం మార్పించుకునే బదులు.. స్టేషన్‌ పరిస్థితులనే మార్చేస్తే పోలా అనుకున్నారు. అంతా ఒక్కటై స్టేషన్‌ రూపు రేఖలు మార్చేశారు.

స్టేషన్‌లో పదికి పదిమందీ మహిళలే..! సాంకేతిక పర్యవేక్షణా వారిదే. విజయవాడ జంక్షన్‌కు సమీపంలో రామవరప్పాడు స్టేషన్ ఉండంతో ప్రతి పది నిముషాలకు ఓ బండి స్టేషన్‌ మీదుగా వెళ్తుంటుంది. అయినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తున్నారు ఇక్కడి మహిళా ఉద్యోగులు.

"వచ్చిన కొత్తలో స్టేషన్​ అంతా గందరగోళంగా ఉండేది. అపరిశుభ్రంగా ఉండేది. మద్యం సేవించేవారు ఎక్కువగా ఉండేవారు. ఇక్కడ పనిచేసేవారందరూ మహిళలే. మేము వచ్చాక ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు చాలా బాగుంది. మాకు ఈ స్టేషన్​ మరో ఇల్లుగా మారిపోయింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా అహ్లాదంగా ఉంటుంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అనడానికి ఇది ఒక నిదర్శనం"- సిబ్బంది

మహిళా సిబ్బంది నిర్వహణా సమర్థతతో స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగే ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్యనూ అధికారులు పెంచారు. నాలుగేళ్ల క్రితం నాటి సమస్యల్ని సవాల్‌గా తీసుకోవడంవల్లే గుర్తింపు దక్కిందని సిబ్బంది చెప్తున్నారు.

"వచ్చిన కొత్తలో అందరూ భయపెట్టారు. ఇక్కడ మద్యం, గంజాయి సేవించేవారు, రౌడీయిజం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెప్పారు. తాగి వచ్చి స్టేషన్​లోనే కొట్టుకునేవారు. ఇక్కడ మద్యం తాగేవారికి అప్పుడప్పుడు కౌన్సిలింగ్​ ఇచ్చేవాళ్లం. కొత్తలో రక్షణ కోసం పెప్పర్​ స్ప్రే కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా మారిపోయింది. చాలా సంతోషంగా పని చేసుకుంటున్నాం"-ఎం. శైలజ, స్టేషన్‌ సూపరింటెండెంట్‌

తమ స్ఫూర్తితో బాధ్యతల నిర్వహణకు మరికొందరు ముందుకు రావాలని.. ఇక్కడి మహిళా సిబ్బంది అభిలషిస్తున్నారు.

ఇదీ చదవండి: Women's Day Special: పూర్వకళ తీసుకురావడంలో వారే చురుకు: స్కిప్‌బాక్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.