తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ... తన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తనకు తెలియకుండానే ఇతరులకు పట్టా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 2016లో అధికారులు ఇతరులకు... అంటే తన భర్త.. తండ్రి (మామ) తోబుట్టువులు అన్యాయంగా పట్టా చేసుకొని ఇతరులకు విక్రయించారని పేర్కొంది.
తన భూమి పట్టా తనకు ఇప్పించాలని రెండు సంవత్సరాలుగా కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. లంచం డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే ఇలా చేశారంటూ ఆరోపిస్తూ.... తన తాళిబొట్టు తీసుకోనైనా పట్టా తన పేరు మీద మార్పు చేయాలని ప్రాధేయపడింది. తాళిబొట్టును తీసి రెవెన్యూ కార్యాలయం గుమ్మానికి తగిలించి నిరసన తెలిపింది.
మాది మానాల. నా భర్త.. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయిండు. నేను నర్సుగా పనిచేస్తూ మా పిల్లలను పోషించుకుంటున్నా. భూమి ఉంది కదా ఎవ్వరూ తీసుకోరు. నేను వేరే వాళ్లకు అప్పు ఉన్న వాళ్లకు తెలిస్తే మా భూమి ఎక్కడ తీసుకుంటారో అని కామ్‌గా ఉన్న. ఇదే సమయంలో మా చుట్టాలు వాళ్ల పేరు మీద పట్టా చేయించుకుని అమ్మేసుకున్నారు. ఎలాగైనా నా భూమిని నాకు ఇప్పించండి. మీకు దండం పెడ్తా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త లేడు. నాకు తల్లిదండ్రులు లేరు. నా తరఫున మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. 45 సంవత్సరాల నుంచి మా మామయ్య పేరు మీద ఉన్న పొలం... ఆయన చనిపోయిన మూడు సంవత్సరాలలో పట్టా వేరే వాళ్ల పేరు మీద అయింది. - మంగ, బాధితురాలు
ఇదీ చదవండి: