విజయవాడ నగరపాలక ఎన్నికల బరిలో 348 మంది నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే 83 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రెండో రోజు లెక్క తేల్చేందుకు అధికారులు అర్ధరాత్రి దాటే వరకు కుస్తీపడ్డారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే సమయానికి మొత్తం 801 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన పూర్తయ్యాక 767 మంది ఎన్నికల పోటీలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఈ రెండు రోజుల్లో మొత్తం 419 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఎంతమంది అంటే..
మొత్తం 64 డివిజన్లకు గాను అధికార వైకాపా నుంచి 64.. తెదేపా నుంచి 57 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటి చేస్తున్నారు. తెదేపా బలపరిచిన సీపీఐ అభ్యర్థులు ఆరు చోట్ల ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. అంతర్గత అవగాహనలో భాగంగా 15వ డివిజన్లో జనసేన అభ్యర్థికి తెదేపా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సీపీఎం నుంచి 21, జనసేన నుంచి 40, భాజపా నుంచి 22, సీపీఐ నుంచి ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 34 చోట్ల, బీఎస్పీ రెండు చోట్ల, ఇతర పార్టీలు ఏడు చోట్ల, స్వతంత్రులు 94 చోట్ల ఎన్నికల పోటీలో నిలిచారు.
ఇదీ చదవండి: