విజయవాడ నగర పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై జిల్లా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మన విజయవాడ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, సబ్ కలెక్టర్ సమావేశమయ్యారు.
అందరికీ అవగాహన...
హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, కళాశాలలు, షాపింగ్ మాల్స్ ఇలా అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగులు, నార సంచులు, అరటి బెరడుతో కప్పులు, ప్లేట్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనతరం ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ పై నిషేధం కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ...వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి..