ETV Bharat / city

ఉప్పొంగుతున్న చెరువులు.. కట్టల మీద రాత్రీ పగలూ కాపలా - హైదరాబాద్​లో ఉప్పొంగుతున్న చెరువులు

చెరువంటే ఊరికి కల్పతరువు. ఎంతో మందికి బతుకుదెరువు. చెరువు నిండితే మనసు పులకరిస్తుంది. భవితకు ఢోకాలేదని భరోసా ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చెరువు నిండుతోందంటే భయం ఆవరిస్తోంది. ఎప్పుడు ఏ చెరువు కట్టతెగుతుందో..ఏ క్షణంలో వరద నీరు కాలనీలను ముంచేస్తుందో తెలియని స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 800 కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

.
.
author img

By

Published : Oct 21, 2020, 11:49 AM IST

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఒకప్పుడు చిన్నా పెద్ద కలిసి దాదాపు 650 చెరువులు ఉండేవి. వీటి మధ్య గొలుసుకట్టుగా నాలాల వ్యవస్థ కూడా ఉండేది. గత కొన్నేళ్లుగా వందల ఎకరాల్లో ఉన్న చెరువులు, నాలాలను అనేకమంది ఆక్రమించారు. దీంతో ప్రస్తుతం 185 చెరువులు మాత్రమే మిగిలాయి. చాలాచోట్ల నీటిని బయటికి పంపించే తూములు మూసుకుపోయాయి.

.
.

ఇది తెగితే... 70 వేల మందిపై ప్రభావం

జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు ఉగ్రరూపం దాల్చడంతో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వరకాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. 642 ఇళ్లు మునిగి 2500 మంది వరకు రోడ్డున పడ్డారు. చెరువుకు 37 అడుగుల సామర్థ్యం ఉండగా 34 అడుగుల ఎత్తుకు నీరు చేరింది. కట్ట తెగితే జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో 70 వేల కుటుంబాల వారు నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉంది. దీనికున్న తూము పూర్తిగా పూడుకుపోయింది. మంగళవారం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఇంజినీర్లు వచ్చి తూము తెరవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో చుట్టుపక్కల బస్తీల వారు భయాందోళనకు గురవుతున్నారు.

వీటిలో దాదాపు 100 కుపైగా చెరువుల్లో ఇప్పుడు నీరు గరిష్ఠ స్థాయికి చేరింది. కట్టలు బలహీనంగా ఉండటంతో మరోసారి భారీ వర్షం పడి , నాలుగైదు అడుగుల నీరుచేరితే అవి తెగే ప్రమాదం ఉందని కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు, స్థానికులు చెరువు కట్టల వద్ద 24 గంటలపాటు కాపలాగా ఉంటున్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్‌ అధికారులు కూడా ఇప్పుడు వీటిపై దృష్టిసారించారు.చెరువుకట్టల పటిష్ఠానికి చర్యలు చేపడుతున్నారు. తూములను తెరిచే పనిని మొదలుపెట్టారు. మరోవైపు చెరువుల పైభాగంలోని కాలనీల వారు కట్టలకు గండికొట్టడానికి ప్రయత్నిస్తుంటే కింది భాగంలో ఉన్న వారు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పరిశీలన ప్రకారం ఈ వంద చెరువుల దిగువ భాగంలో దాదాపు అయిదు లక్షలమంది నివాసం ఉంటున్నారు.

* మీర్‌పేట చెరువు దాదాపుగా నిండిపోయింది. గండిపడితే సరూర్‌నగర్‌, బాలాపూర్‌ తదితర సమీప ప్రాంతాలను నీరు ముంచేస్తుంది. దాదాపు 50 వేల మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

* బండ్లగూడ తటాకం పొంగడంతో ఇప్పటికే మూడు కాలనీలు మునిగిపోయాయి. ఈ కట్టకు గండిపడితే దాదాపు పన్నెండు కాలనీల్లో ఉండే వేలాదిమంది ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.

* రాజేంద్రనగర్‌ పరిధిలోని పల్లెచెరువుకు గండిపడి ఇప్పటికే ఎనిమిది మంది మరణించారు. గండిపూడ్చినా మళ్లీ వర్షపు నీటితో నిండిపోయింది.

* వనస్థలిపురం కప్రాయ్‌ చెరువు నిండిపోవడంతో పది రోజుల కిందటే నాలుగు కాలనీల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ చెరువు కట్టకు గండిపడితే అనేక కాలనీలు ముంపునీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.

కట్టలు తెగకుండా చర్యలు

-సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

కమిషనరేట్‌ పరిధిలో అన్ని చెరువుల మీద దృష్టిసారించాం. కట్టలు తెగకుండా ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన కట్టలను ఇసుక బస్తాలతో పటిష్ఠం చేస్తున్నాం. పల్లెచెరువుకు ఇటీవల గండిపడిన నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మరో చెరువు దగ్గర జరగకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.

ప్రత్యేకంగా దృష్టి

-జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు

బల్దియా పరిధిలో అన్ని చెరువుల కట్టలను పటిష్ఠం చేసే పనిని పెద్దఎత్తున మొదలుపెట్టాం. అవసరమైన వాటి తూములను తెరవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. కట్ట తెగుతుందని ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. భారీ వర్షాలు పడినా కూడా కట్టల మీది నుంచి నీరు ప్రహహించకుండా ముందస్తుగానే అన్ని పనులు మొదలు పెట్టాం.

ఆక్రమణలతో చేటు

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల చెరువుల భూములు కబ్జాకు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నగర శివార్లలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలో ఉన్న కాజాగూడలో ఉన్న తౌటమోని కుంట మధ్య రోడ్డు నిర్మించారు.పైగా చెరువు కబ్జాలకు గురవుతోంది. గగన్‌ పహాడ్‌ అప్పా చెరువు విస్తీర్ణం 14 ఎకరాలు కాగా దానిలో ఏడెకరాల్లో కబ్జాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లా కేంద్రాలతోపాటు పురపాలక సంస్థల పరిధిలోని చెరువుల్లో ఆక్రమణలున్నాయి.

ఎవరికీ పట్టని వాల్టా చట్టం

చిన్ననీటి వనరులను పరిరక్షించేందుకు ఉన్న వాల్టా చట్టం (వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌-2002) అమలు ఎవరికీ పట్టడం లేదు. చట్టం అమలుకు ఏర్పాటుచేసిన కమిటీల్లో పలు శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ చెరువుల్లో మట్టి తవ్వకాలు, ఇసుక తోలడాలు ఆగడం లేదు. నాగర్‌కర్నూల్‌లో చెరువుల ఆక్రమణలపై ఇటీవలే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టంలోకి (ఎఫ్‌టీఎల్‌) నిర్మాణాలను అనుమతించకుండా నియంత్రించి పాటు కాల్వలు, తూములు, పంట కాల్వల ఆక్రమణను నిలువరిస్తే తప్ప ప్రమాదాలకు అడ్డుకట్ట పడదు. ఆక్రమణలపైనా ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.