విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు నగరపాలక సంస్థ, ఆయూష్ ఆసుపత్రిలో సంయుక్తంగా వైద్య శిబిరం నిర్వహించారు. నగరంలో సుమారు 3 వేలపై చిలుకు మంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని నగర పాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. కోవిడ్ నివారణకై పారిశుద్ధ్య కార్మికులు ముందు వరసలో ఉండి పని చేస్తున్నారని కొనియాడారు.
ఇప్పటికే నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయని నగర పాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. ఈ శిబిరం వారం పాటు నిర్వహిస్తామన్నారు. కార్మికుల వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ఆన్లైన్లో పెట్టి... 6 నెలల తర్వాత తిరిగి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమస్యలు ఉన్నవారికి కంటైన్మెంట్ జోన్ లలో కాకుండా మామూలు ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు