ETV Bharat / city

విశాఖలో మృతి చెందిన వారు విజయవాడ వాసులుగా గుర్తింపు - visakapatnam district news

విశాఖలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య ఘటనలో బాధితులు విజయవాడకు చెందిన వారని పోలీసులు తెలిపారు. సమీప బంధువు వివాహ వేడుక పనుల నిమిత్తం వారు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. వారికి ఎటువంటి వివాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు.

vizag deaths case
విశాఖలో మృతి చెందిన బాధితులు విజయవాడ వాసులుగా గుర్తింపు
author img

By

Published : Apr 16, 2021, 6:57 AM IST

విశాఖపట్నంలో సంచలనం రేపిన ఆరుగురి హత్య ఘటనలో.. బాధితులు విజయవాడ వాసులని పోలీసులు గుర్తించారు. విశాఖపట్నానికి చెందిన విజయ్ మూడేళ్ల కిందట విజయవాడకు వచ్చి స్థిరపడ్డాడు. విజయవాడలోని అత్త రమాదేవి ఇంట్లోనే ఉంటూ చిరుద్యోగం చేస్తున్నాడు. తన మరదలి వివాహానికి కార్డులు పంచి.. పెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు విశాఖలోని తండ్రి రమణ ఇంటికి వెళ్లారు.

ఇదీ చదవండి: విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

గత బుధవారం వారు విశాఖకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి విజయ్ భార్య ఉష తో మాట్లాడామని పేర్కొన్నారు. ఉదయాన్నే వారి మరణ వార్త విని ఒక్కసారిగా తాము షాక్​కు గురయ్యామన్నారు. స్థానికంగా విజయ్ కుటుంబానికి ఎటువంటి గొడవలు లేవని వారు అంటున్నారు. చిన్న పిల్లలను సైతం చంపటం దారుణమని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: బంగాల్​ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.