ఆగస్టు ఒకటో తేదీ నుంచి విజయవాడ - విశాఖపట్నం మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 5.20 గంటలకు విశాఖలో బయలుదేరి 6.25 గంటలకు విజయవాడ చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
SRISAILAM: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల