VISAKHA STEEL: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం జూన్ 26వ తేదీ నాటికి 500 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెదేపా వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు లక్షల కోట్లు చేసే ప్రజల ఆస్తి విశాఖ ఉక్కు కర్మాగారం అని.. దానిని వేలం వేసి, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: