ETV Bharat / city

అర్ధరాత్రి యువకులు హల్​చల్.. బైక్​లతో ప్రమాద విన్యాసాలు - విజయవాడలో అర్ధరాత్రి యువకులు బైక్ రేసింగ్

ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో ప్రమాదకర స్టంట్స్​ చేస్తున్నారు విజయవాడ కుర్రాళ్లు. అర్ధరాత్రి అయితే చాలు రోడ్లపై దూసుకుపోతున్నారు. నగర శివార్లలో హైవేపై హల్ చల్ చేస్తున్నారు. సినీ తరహాలో బైక్​లపై ఫీట్స్ చేస్తు ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువత అత్యధిక సంఖ్యలో ఉన్నా కొందరి వెర్రి చేష్టలు మాత్రం తగ్గటంలేదు.

bike racing
bike racing
author img

By

Published : Nov 24, 2020, 4:08 PM IST

Updated : Nov 24, 2020, 4:18 PM IST

అర్ధరాత్రి యువకులు హల్​చల్.. బైక్​లతో ప్రమాద విన్యాసాలు

అర్ధరాత్రి అయితే చాలు హైవేపై ఆకతాయిలు బైక్​లతో చక్కర్లు కొడుతున్నారు. రయ్ రయ్ మంటూ అతివేగంతో దూసుకెళ్తున్నారు. విజయవాడ నగర శివారుల్లోని రహదారిపై.. ఖరీదైన బైకులతో యువకులు రోడ్డెక్కుతున్నారు. మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారు. సినిమా స్టంట్స్ తరహాలో బైక్​లతో విన్యాసాలు చేస్తున్నారు. రోడ్లపై యువత హల్ చల్ చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంకిపాడు - విజయవాడ రహదారిలో యువకులు అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు. సుమారు పది మంది యువకులు బైక్ రేసింగ్​లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

బైక్ రేసులు, విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు.​ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువకులే అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయినా యువకులు రేసింగ్​లకు పాల్పడుతూ..ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రేసింగ్​లపై సమాచారం అందుకున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు ట్రాఫిక్ పోలీసులు, పెనమలూరు పోలీసులను దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం.

ఇదీ చదవండి :

నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

Last Updated : Nov 24, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.