ETV Bharat / city

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైకాపా అభ్యంతరం - rti

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకం అభ్యంతరం తెలిపారు.

విజయసాయిరెడ్డి
author img

By

Published : May 10, 2019, 9:08 PM IST

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. విజయవాడకు చెందిన ఓ హోటల్ యజమానిని కమిషనర్ గా నియమించటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తి తెదేపా అనుచరులని తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టే వారికి తగిన అర్హతలు ఉండాలన్నారు. లా, సైన్స్ ఆండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్ మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఎంపిక చేయాల్సి ఉందన్నారు .
పార్టీతో కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లో ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ‌హోటల్ యజమానిని, ప్రైవేటు సెక్రటరీగా ఉండే వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కొందరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. రాజకీయ దురుద్దేశంతో నియామకాలను చేపట్టారని.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు నియామకాలు చేపట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు.

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైకాపా అభ్యంతరం

ఇది కూడా చదవండి.

సీఈసీ చెంతకు మంత్రిమండలి అజెండా

Intro:Ap_Nlr_01_10_Sahakara_Bank_Golmal_Kiran_Pkg_C1

యాంకర్: రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న సహకార బ్యాంక్ ఇంటి దొంగల పనితో అప్రదిష్టపాలైంది. దాదాపు 64 లక్షల రూపాయల బ్యాంకు సోమ్మును అనామ్మత్తుగా వాడుకున్నారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని సహకార రూరల్ బ్యాంకులో జరిగిన ఈ గోల్ మాల్ తో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనంపై కథనం.
వి.ఓ.1:- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని సహకార రూరల్ బ్యాంకుకు దశాబ్దాల చరిత్ర ఉంది. గ్రామీణ ప్రాంత రైతులకు అన్ని వనరులు, తక్కువ సమయంలో అందించాలన్న లక్ష్యంతో 1957వ సంవత్సరంలో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆదాయ బాటలో నడుస్తూ, రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న ఈ బ్యాంకులో 4,500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఏటా 50 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహిస్తూ, రెండు కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తూ, సహకార బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపున్న ఈ బ్యాంకులో నిధులు పక్కదారి పట్టాయి. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా, 64 లక్షల రూపాయలను అనామత్తుగా తీసుకున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 5వ తేది మధ్యలో భారీగా నగదు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ గోల్ మాల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో క్యాషియర్ ఈశ్వరయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పాలకమండలి సభ్యులతో కలిసి క్యాషియర్ అవకతవకలు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నారు.
బైట్: సుబ్బారెడ్డి, ఖాతాదారుడు, బుచ్చి.
శరత్ కుమార్ రెడ్డి, ఖాతాదారుడు, బుచ్చి.
వి.ఓ.2:- బ్యాంకు పాలకవర్గమే అవకతవకలు పాల్పడి, నగదు కాజేసి ఉంటుందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. బ్యాంక్ వ్యవహారంపై మాట్లాడొద్దంటూ తమను పాలకవర్గం బెదిరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అవకతవకలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బైట్: గురునాథం, కౌలు రైతు సంఘం నేత, బుచ్చి.
వి.ఓ.3:- అనారోగ్యం కారణంగా తాను సెలవుపై ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగిందని బ్యాంకు మేనేజర్ రమణయ్య చెబుతున్నారు. నగదు లెక్కింపులో తేడా రావడంతో, బాధ్యత వహించిన పాలకవర్గం ఆ మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేసిందని ఆయన తెలియజేశారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అప్పుడు అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఖాతాదారులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.
బైట్: రమణయ్య, వవ్వేరు సహకార బ్యాంక్ మేనేజర్, బుచ్చి.
వి.ఓ.4:- బ్యాంకులో నగదు గోల్ మాల్ పై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సహకార సంఘాల సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.