విజయవాడలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని సుచరిత స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
పోలీసు స్టేషన్ తనిఖీ
అంతకు ముందు హోంమంత్రి సుచరిత గుంటూరు జిల్లా కొల్లూరు పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసుల వివరాలపై ఆరా తీశారు. మహిళా పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఇదీచదవండి
మొదట్లో అబ్బాయిలు సున్నితంగా ఉండి... తర్వాత ముసుగు తొలగిస్తారు