ETV Bharat / city

సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో విజయవాడ రైల్వే డివిజన్‌ సత్తా

author img

By

Published : Jan 18, 2021, 6:41 AM IST

పెరుగుతోన్న విద్యుత్ ఛార్జీలు ….సామాన్యులతో పాటు పరిశ్రమలకు, రవాణా సంస్థలకూ భారంగా మారుతున్నాయి. దీంతో అందరూ పునరుద్పాదక ఇందన వనరులపై దృష్టిసారించారు. అందులో భాగంగానే రైల్వే శాఖ...సూర్య కిరణాలను ఒడిసి పట్టి విద్యుత్ శక్తిగా మార్చుతోంది. విజయవాడ డివిజన్‌లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.... ఏటా ఏకంగా 40 లక్షల యూనిట్లు పొదుపు చేస్తున్నారు

Vijayawada Railway Division
సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో విజయవాడ రైల్వే డివిజన్‌ సత్తా

దక్షిణ మధ్య రైల్వేకి అధిక ఆదాయం తీసుకువచ్చే విజయవాడ డివిజన్‌.... ప్రయాణికులు, సరకు రవాణాలోనే కాదు...విద్యుత్ పొదుపులోనూ సత్తా చాటుతోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో విజయవాడ రైల్వే డివిజన్‌ తనదైన ముద్ర వేస్తోంది. దేశంలోనే తొలిసారి బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫొటో వోల్టాయిక్ .. సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ లోని 4,5 ప్లాట్ ఫాంపై సౌరవిద్యుత్‌ ఫలకలు ఏర్పాటు చేసి...భారీగా ఉత్పత్తి సాధిస్తోంది. మరో 65 కిలోవాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నారు.

మొత్తం 137 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ సౌరవిద్యుత్ ప్లాంట్ల ద్వారా 1.38 లక్షల యూనిట్ల వినియోగాన్ని తగ్గించడమే గాక...12.59 లక్షలు పొదుపు చేస్తున్నారు. డివిజన్ పరిధిలో కడియం, ద్వారపూడి, గోదావరి రైల్వే స్టేషన్లను పూర్తిగా సౌర శక్తితో పనిచేసేలా తీర్చిదిద్దారు. 3 స్టేషన్లలో 10 కిలోవాట్ సామర్థ్యం చొప్పున సోలార్ ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

షెల్టర్లుగా సోలార్ ప్లాంటు..

డివిజన్ పరిధిలో 150కిలోవాట్ల సామర్థ్యంతో 25 స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై షెల్టర్లుగా సోలార్ ప్లాంట్లను పీపీఎ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెనాలి, నిడదవోలు స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేయగా .. మిగిలిన చోట్ల ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. డివిజన్ మొత్తంగా 25 పంపులు సౌర శక్తితోనే పనిచేస్తున్నాయి. రైల్వే ఆవరణలో సౌర శక్తితో పనిచేసే 102 సోలార్ వీధి లైట్లను ఏర్పాటు చేసి 4.05 లక్షలు పొదుపు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లెవెల్ క్రాసింగ్ గేట్లను కూడా సౌరశక్తితో నడిపించి మరో లక్షా 15 వేల రూపాయలు పొదుపు చేస్తున్నారు.

రైల్వేస్టేషన్లు, ప్లాట్ ఫాంలు, కార్యాలయాల ప్రాంగణాల్లో సోలార్ ట్రీల ఏర్పాటుతో శక్తిని సృష్టిస్తున్నారు. రైల్వేశాఖకు చెందిన అన్ని కార్యాలయాల్లో సోలార్‌ హీటర్లను వినియోగిస్తున్నారు. సిబ్బందికి విద్యుత్ పొదుపులో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:

విద్యుత్ ఛార్జీలపై నేటి నుంచి అభిప్రాయ సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.