Vangaveeti Radha Issue: ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఎవరు అలజడి సృష్టించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా హెచ్చరించారు. వంగవీటి రాధా ఇంటి వద్ద ఇటీవల రెక్కీ నిర్వహించారన్న ఆయన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. రాధా ఆరోపణల నేపథ్యంలోనే పోలీసుశాఖ దర్యాప్తు చేపట్టిందన్నారు.
వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?
Vangaveeti Radha Sensational Comments: కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. తెదేపా నేత వంగవీటి రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో.. రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాధా వ్యాఖ్యలపై అప్రమత్తమైన ప్రభుత్వం.. వెంటనే గన్మెన్లను కేటాయించింది. కానీ గన్మెన్లను తీసుకునేందుకు వంగవీటి రాధా నిరాకరించారు. ఇదే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు.. డీజీపీకి కూడా లేఖ రాశారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Wineshops timing change: ఇవాళ రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు.. 12 గంటల వరకు బార్లు