బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఒక్క రోజునే దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్రప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించనుంది. కిందటి ఏడాదితో పోల్చుకుంటే దసరా ఉత్సవాల ప్రారంభం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: సర్వసతి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ