విజయవాడ వాసుల స్వప్నం కనకదుర్గ వారధి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ నాలుగో తేదీన దుర్గగుడి పై వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. ఈ పనులను ఆయన ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి పరిశీలించారు.
దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని మంత్రి అన్నారు. వచ్చే నెల నాలుగో తేదీ లోగా మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నాలుగో తేదీన కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. రవాణాశాఖకు చెందిన రూ.13 వేల కోట్ల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ గుట్ట కబ్జా.. చదును చేసి సాగుభూమిగా మార్పు..!