కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ బయోటెక్ చేస్తున్న కృషి అభినందనీయమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఆయన సతీమణి అనురాధ అన్నారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రయోగాత్మక పరీక్షల్లో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉందన్నారు. సైన్స్ విద్యార్థులుగా బాధ్యతతో ప్రయోగాలకు స్వచ్ఛందంగా సహకరించినట్లు గద్దె రామ్మోహనరావు దంపతులు తెలిపారు.
ఇదీ చదవండి :
'గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'