విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను సీపీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు లాక్డౌన్ పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని.. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. నిత్యావసర సరుకులు, బ్యాంకింగ్, టెలికం నిత్యం పనిచేస్తాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఉన్న సమయాన్ని కుదించే అవకాశం ఉందన్నారు. పోలీసు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: