ETV Bharat / city

రాష్ట్ర అంశాలను కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం: విజయసాయిరెడ్డి - ఏపీ కనకమేడల కామెంట్స్​ ఆన్​ ఏపీ

Reviewed with Mps Over Budget 2022: పెగాసస్‌ వ్యవహారం సామాన్య ప్రజల అంశం కాదని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్రం చేపడుతున్న ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌, ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి, తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల పాల్గొన్నారు.

Budget 2022
ఎంపీ విజయసాయిరెడ్డి
author img

By

Published : Jan 31, 2022, 10:24 PM IST

Venkaiah Reviewed with Rajya Sabha Mps over budget 2022: పెగాసస్‌ వ్యవహారం సామాన్య ప్రజల అంశం కాదని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైకాపా పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కేంద్రం చేపడుతున్న ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌, ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఐదేళ్లు పొడిగించాలని కోరారు. మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని సూచించారు.

తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 10లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ప్రధానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశాలు అడ్డుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘిస్తోంది: కనకమేడల

MP kanakamedala: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్చువల్​గా నిర్వహించిన అఖిలపక్ష భేటీకి తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర​కుమార్​ హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘిస్తోందని కనకమేడల ఆరోపించారు. అమరావతి, పోలవరం పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని సమావేశంలో కేంద్రాన్ని కోరారు.

ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.