ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాదులు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వాడుక భాష ద్వారా అందరికీ విజ్ఞానం అందాలని గిడుగు ఉద్యమించారని కొనియాడారు. తెలుగుభాషను కాపాడుకోవటమే గిడుగుకు మనం అందించే నివాళి అని పేర్కొన్నారు. యువతకు సంస్కృతి, మాతృభాష చేరువ చేయడం ప్రతి ఒక్కరీ బాధ్యత అని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!