రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ... విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ యాగం వేదమంత్రోచ్ఛరణల మధ్య కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ మండపారాధనలు నిర్వహించారు. పండితులతోపాటు వేద విద్యార్థులు సైతం వరుణ యాగంలో పాల్గొని హోమాలు చేస్తున్నారు. యాగంలో తుది ఘట్టమైన సహస్ర ఘటాభిషేకం రేపు ఉదయం 6 గంటల నుంచి జరుగుతుంది. ఘటాలతో ఊరేగింపుగా కృష్ణా నదీ జలాలను మల్లేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి... వరుణుడి రాక కోసం... కప్పలకు పెళ్లి