ETV Bharat / city

Varla Ramayana Protest Initiation: నేడు వర్ల రామయ్య దీక్ష.. సీఎం జగన్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

చంద్రబాబు భార్యపై వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెదేపా నేత వర్ల రామయ్య దంపతులు.. నేడు నిరసన దీక్ష(Varla Ramayana Protest Initiation) చేయనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు భార్యపై వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలపై.. సీఎం జగన్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
author img

By

Published : Nov 24, 2021, 7:47 PM IST

Updated : Nov 25, 2021, 12:34 AM IST

Varla Ramayana Protest Initiation: అసెంబ్లీలో చంద్రబాబు భార్యపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా నేత వర్ల రామయ్య దీక్ష చేయనున్నారు. సీఎం క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నేడు వర్ల రామయ్య దంపతులు.. 12 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నట్లు వర్ల రామయ్య(tdp leader varla ramaiah news) తెలిపారు.

పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం..
నవంబర్​ 19న ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో తాను మాట్లాడుతుండగా.. స్పీకర్​ మైక్​ కట్​ చేశారని చంద్రబాబు తెలిపారు. దాంతో అసెంబ్లీ నుంచి చంద్రబాబు, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఒక్కసారిగా భోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు. తన భార్యను అవమానించేలా అసెంబ్లీలో అధికారపక్షం వాళ్లు మాట్లాడారని చంద్రబాబు గద్గద స్వరంతో తెలిపారు.

ఇదీ చదవండి: నర్సీపట్నంలో ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యన్నపాత్రుడు ధర్నా

Last Updated : Nov 25, 2021, 12:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.