విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ తూతూమంత్రపు శంకుస్థాపన చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. వై.ఎస్ జయంతికి తాడేపల్లి నుంచి 700 కిలోమీటర్లు వెళ్లిన జగన్... పక్కనే ఉన్న స్వరాజ్ మైదానానికి వచ్చి శంకుస్థాపన చేయలేరా అని నిలదీశారు. స్వరాజ్ మైదానం కోర్టు జప్తులో ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా అని వర్ల ప్రశ్నించారు.
స్వరాజ్ మైదానం 20 ఎకరాలని చెబుతున్నా..,ఆక్రమణలు పోగా మిగిలింది 13 ఎకరాలేనని వర్ల స్పష్టం చేశారు. ప్రభుత్వ అధీనంలోలేని కోర్టు వివాదాల్లో ఉన్న భూమిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎలా పెడతారో దళితులకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.