ETV Bharat / city

Varla Ramaiah: 'ఓటరు జాబితాలో లోపాలు సవరించండి'.. ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య వినతి

Varla Ramaiah Meet chief Electoral Officer: ఓటర్​కు బయో మెట్రిక్ చేయటం ద్వారా దొంగ ఓట్లు పూర్తిగా నిరోధించవచ్చునని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఓటరు జాబితాలో లోపాలు సవరించాలని కోరుతూ.. ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన ఆయన.. ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాల్లో ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు.

ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య వినతి

author img

By

Published : Jan 6, 2022, 10:15 PM IST

Varla Ramaiah Meet chief Electoral Officer: ఓటరు జాబితాలో లోపాలు సవరించాలని కోరుతూ.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్​ను కలిశారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్‌లో ఉండేలా చూడటంతో పాటు.. చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించాలని కోరారు. వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాలల్లో ఓటు కలిగి ఉన్నారని, గ్రామ రెవెన్యూ అధికారులు అధికార వైకాపాకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మాత్రమే చేర్చి.. ఇతర పార్టీల ఓట్లను తొలగిస్తున్నారన్నారని ఆరోపించారు. ఓటరు​కు బయోమెట్రిక్ చేయటం ద్వారా దొంగ ఓట్లు పూర్తిగా నిరోధించవచ్చునని వర్ల సూచించారు.

ఇదీ చదవండి

CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.