పక్షపాతంగా పని చేస్తున్న డీజీపీ రాష్ట్రానికి అవసరమా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రస్తుత డీజీపీ వ్యవహారశైలితో పోలీస్ వ్యవస్థ మసకబారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఆడియో, వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియోను మీడియా సమావేశంలో వినిపించారు. అచ్చెన్నాయుడు ఎవరినీ బెదిరించకుండా బ్రతిమలాడితే..., బెదిరించిన వైకాపా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా అచ్చెన్నను అరెస్ట్ చేసి జైలుకి పంపారని మండిపడ్డారు.
పోలీసుల్ని పక్కనే పెట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా మాట్లాడారో తెలుసుకుంటే మంచిదని డీజీపీకి హితవు పలికారు. ఎమ్మెల్యే కన్నబాబు, దువ్వాడ శ్రీనివాస్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. అచ్చెన్న అక్రమ అరెస్టుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి 'శాసనసభ రూల్స్‌కు వ్యతిరేకంగా నోటీసులివ్వడం దారుణం'