రెండేళ్లలో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని తిరుపతి పార్లమెంట్‌కు ఓటు అడుగుతున్నారని వైకాపాను.. తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. అవినీతి, అసమర్థతలతో పూర్తిగా సతమతమవుతున్న వైకాపా ఓ దొంగలముఠాతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు కొంచెం నిక్కచ్చిగా వైకాపా వాహనాలన్నీ తనిఖీ చేస్తే, అవినీతి సొమ్ము గుట్టలు గుట్టలుగా బయటపడుతుందన్నారు. నిజాయితీపరులైన నలుగురు పోలీస్ అధికారులను మంత్రి పెద్దిరెడ్డికి షాడో పార్టీగా పెడితే తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో వైకాపాకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉపపోరులో హోరెత్తిన ప్రచారం