పోలీసు ఫిర్యాదుల సెల్ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ నియామకాన్ని తెదేపా నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యతను వైకాపా నేతలు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న కనగరాజ్‌కు అప్పగించటం అభ్యంతరకరమన్నారు.
"పోలీసు ఫిర్యాదుల సెల్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం తగదు. గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎన్నో అడ్డగోలు నియామకాలు జరిపింది. నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను రబ్బర్ స్టాంప్‌గా మార్చారు. రాజ్యాంగవ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య విలువలను జగన్ మంటగలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో నియామకాలు చేపట్టాలి." అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
PCA CHAIRMAN: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్