శిక్షణ పూర్తి చేసుకొని కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్సైకి శిరోముండనం చేయాలన్న ఆలోచన రాదని, ఎస్సైని ఎవరో ప్రలోభపెట్టి, రెచ్చగొట్టారని.. వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా, అసలు ముద్దాయిలను వదిలిపెట్టారని లేఖలో ప్రస్తావించారు. దళిత యువతకు న్యాయం చేయాలని వర్ల కోరారు. బాధితుడు రాష్ట్రపతి కి లేఖ రాయడంలో తీవ్రత గుర్తించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!