ETV Bharat / city

వైకాపా దళిత వ్యతిరేక ప్రభుత్వం: వర్ల రామయ్య - వైకాపా దళిత వ్యతిరేక ప్రభుత్వం: వర్ల రామయ్య

వైకాపాది దళిత వ్యతిరేక ప్రభుత్వమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడికైనా రుణాలు ఇచ్చారేమో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైకాపా దళిత వ్యతిరేక ప్రభుత్వం: వర్ల రామయ్య

author img

By

Published : May 26, 2020, 6:35 AM IST

తెదేపా అధినేత చంద్రబాబును చూసి జగన్ ప్రభుత్వం గజగజ వణుతుతోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా నేతలందరి కంటే చంద్రబాబు మానసికంగా, శారీకంగా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబును చూడటానికి వచ్చిన వారిపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. మద్యం షాపులు తెరిచినప్పుడు గుంపు గట్టిన జనంపై కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడికైనా రుణాలు ఇచ్చారేమో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 13 జిల్లాల్లో దళితులకు రుణాలు మంజూరు చేశామన్న అంశంపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే వైకాపా నాయకులతో బూతులు తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత సంక్షేమంపై చర్చకు హోం మంత్రులు సుచరిత, సురేష్ మరెవరైనా దళిత నేతలు వచ్చినా.. తాను సిద్ధమని సవాల్ చేశారు. వైకాపా ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని నిరూపిస్తానని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.