ETV Bharat / city

రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో ఈరోజు ముగ్గురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. పుట్టినరోజునే ఒకరు, 108 వాహనం రాక ఆలస్యమవడంతో మరొకరు తనువు చాలించారు. వాహన చోదకుల అజాగ్రత్తే ఆయా ప్రమాదాలకు కారణమని బాధితులు వాపోయారు.

road accidents
రోడ్డు ప్రమాదాలు
author img

By

Published : Nov 22, 2020, 9:39 PM IST

వివిధ ప్రమాదాల్లో రహదారులు రక్తమోడాయి. ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వాహనచోదకుల అజాగ్రత్త.. ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. పదమూడు మందిని గాయాలపాలు చేసింది.

పుట్టినరోజే ఆఖరిరోజైంది..

పుట్టినరోజు జరుపుకున్న కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఆత్రేయపురంకు చెందిన తాడేపల్లి వెంకట శ్రీరామమూర్తి. ద్విచక్రవాహనంపై పూతరేకుల వ్యాపారం నిమిత్తం బయలుదేరిన వ్యాపారిని.. అంతర్వేది నుంచి విజయనగరం వెళుతున్న మినీ వ్యాన్ కందాల పాలెం వద్ద ఢీకొంది.

అదే సమయంలో మినీ వ్యాన్ పక్కునున్న ఆటోనూ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఎనిమిది మంది మినీ వ్యాన్​లో వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో వాన్​ డ్రైవర్ రామకృష్ణ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'అంబులెల్స్ ఆలస్యమే ప్రాణాలు తీసింది'

విశాఖ జిల్లా కశింకోట జాతీయ రహదారిపై.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. బుద్ద లక్ష్మి అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ లక్ష్మిని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేయగా.. సకాలంలో స్పందించలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించడం కోసం గంటన్నరపాటు అంబులెన్స్ కోసం వేచిచూడాల్సి వచ్చిందని తెలిపారు. 108 సకాలంలో రాకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతుచిక్కని ప్రమాదం...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పురుషోత్తం నగర్ కాలనీకి చెందిన దంత పవన్ కుమార్.. ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతనిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. అతడు పాలిటెక్నికల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి కృష్ణారావు.. విశాఖ జిల్లా సింహాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

బైక్​ను తప్పించబోయి...

తుంగభద్ర పుష్కరాలకు వెళుతూ ఆటో బోల్తా పడి.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు క్రాస్ దగ్గర.. బెలగల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాలకు వెళుతున్నారు. బైక్​ను తప్పించబోయి.. ఆటో అదుపు తప్పింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు.

శ్రీవారి దర్శనానంతరం...

తిరుమల కనుమ దారిలో టెంపో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి కిందకు దిగే సమయంలో.. వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీ కొట్టింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: దుకాణంలో చోరీ...సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.