ETV Bharat / city

అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా?: వంగలపూడి అనిత

అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా? అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా ఏడాదిన్నర పాలనలో మహిళలపై 400కు పైగా దాడులు జరిగినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ అనేది ఉందా అని దుయ్యబట్టారు.

వంగలపూడి అనిత
వంగలపూడి అనిత
author img

By

Published : Dec 21, 2020, 5:45 PM IST

వైకాపా ఏడాదిన్నర పాలనలో మహిళలపై 400కు పైగా దాడులు జరిగాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వైకాపా నేతల్లో కొందరు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే..మరికొందరు అత్యాచారాలు చేసిన వారికి మద్దతుగా నిలవటం దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళను అత్యాచారం చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

అనంతపురం జిల్లాలో బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారం చేస్తే.. ఎంపీ గోరంట్ల మాధవ్ నిందితుడికి రక్షణగా నిలవటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి సజీవ దహనంపై హోంమంత్రి స్పందించకపోవటం దారుణమన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లకు కష్టమొస్తే ఇలానే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా ? అని నిలదీశారు. రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ ఉందా అని దుయ్యబట్టారు.

ఉద్యోగాల క్యాలెండర్ ఊసేది?

నిరుద్యోగులకు ప్రతి ఏటా జనవరి 1న ఉద్యోగాల భర్తీకి సంబంధిచిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం జగన్ హామీ ఏమైందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ నిలదీశారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారన్నారు. ఏడాదిన్నరలో సొంత వర్గానికి సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాల పేరుతో 4 వేల కోట్లు దోచిపెట్టారే తప్ప ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు కడుపుమండి జగన్ పదవి ఊడగొట్టకముందే వారికిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

రేషన్ డీలర్లను రోడ్డు పాల్జేస్తారా?

రేషన్ డీలర్లను పొమ్మనకుండా పొగపెట్టే రీతిలో ముఖ్యమంత్రి జగన్ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ విమర్శించారు. వాహనాల కొనుగోలు ముసుగులో కొత్తవారికి రేషన్ పంపిణీ వ్యవస్థను అప్పగించేలా సర్కారు చర్యలున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికే కందిపప్పు, పంచదార ధరలు పెంచి ప్రజలపై 710 కోట్ల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేషన్ డీలర్ల కమీషన్ సొమ్ము కూడా దిగమింగి వారిని రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు తాను ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.