కేంద్రం ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న మంత్రులే... రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగించే బిల్లులను తెచ్చినందుకు పదవిని సైతం వదులుకుని.. రైతు ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతుంటే.. వైకాపా, తెదేపాలు పోటీపడి మద్దతు ఇచ్చి రైతు ప్రయోజనాలను కాలరాశారని ఆరోపించారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ రైతులకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను వ్యతిరేకించకపోతే.. రైతుల ఆగ్రహానికి గురవుతారని... రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. రాజ్యసభలో అయినా బిల్లులను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. రైతు పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బిల్లులకు వ్యతిరేకంగా 25వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు