విజయవాడ కనకదుర్గ పైవంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 18న ప్రారంభించేందుకు కేంద్రమంత్రి గడ్కరీ సమయం కేటాయించారు. కార్యక్రమం ఖరారు చేస్తూ ఎంపీ కేశినేని నానికి.. గడ్కరీ లేఖ పంపారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పైవంతెన ప్రారంభించనున్నారు. దీనితోపాటుగా రాష్ట్రంలోని మరో 16 రహదారుల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి; దళితులపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు