ETV Bharat / city

చోరీ కేసుల్లో నిందితులు అరెస్టు... భారీగా సొత్తు స్వాధీనం - చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులు అరెస్టు

విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఓ కేసులో ఇంట్లో పనిచేసే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి చోరికి పాల్పడగా... మరో ఘటనలో పాత నేరస్థుడు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

చోరీ కేసుల్లో నిందితులు అరెస్టు...భారీగా సొత్తు స్వాధీనం !

author img

By

Published : Jun 30, 2020, 7:06 PM IST

విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటిన విజయవాడ వన్​ టౌన్​ పరిధిలోని బంగారం షాపులో చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే ఆమోల్ వసంత్ పటేల్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించారు. విజయవాడ పోలీసు కమిషనర్​ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... దుకాణం యజమాని ఆనంద్ జగన్నాథ్​ సోలంకి ఊరికి వెళ్తూ.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమోల్, ఆనంద్ అనే సిబ్బందికి సూచించారు. ఇంట్లో లక్షల విలువైన బంగారం ఉన్న కారణంగా.. ఆమోల్ అతని స్నేహితుడు శైలేష్ పాటిల్​తో కలిసి వాటిని కాజేయటానికి పథకం రచించారు.

ఆనంద్​ ఇంట్లో లేని సమయంలో 56.65 లక్షల రూపాయల విలువైన 1225 గ్రాముల బంగారంతో ఆమోల్ అతని స్నేహితుడు ఉడాయించారు. బయటకు వెళ్లిన ఆమోల్ ఎంతకు తిరిగి రాకపోవటంతో ఆనంద్.. యాజమానికి ఫోన్ చేశాడు. అనుమానం వచ్చిన యాజమాని జగన్నాథ్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా... బంగారం కనిపించలేదు. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకొని చోరి సొత్తును రికవరీ చేశారు.

మరో ఘటనలో ఉయ్యూరు పట్టణంలో వరసగా చోరీలు చేస్తున్న గుబిలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉయ్యూరు టీవీఎస్ షోరూం యజమాని రత్నం శివ వరప్రసాదరావు. షోరూంపై అంతస్థులో సుబ్రహ్మణ్యం నివసిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో అతను శబరిమలకు వెళ్లగా... ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలోని 77 లక్షల విలువైన నగదు, నగలు దుండగులు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఉపయోగించిన ద్విచక్రవాహనం నెంబర్​ప్లేట్​ గుర్తంచి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.