ETV Bharat / city

బుద్ధిగా ఉండాలని మందలింపు... ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్​ - two died in pond news

two died in pond: తండ్రి మందలించాడని ఓ కొడుకు చేసిన పని.. ఇద్దరిని బలితీసుకుంది. చస్తానంటూ తండ్రిని బెదిరించిన యువకుడు చెరువులో దూకి.. చక్కగా ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరాడు. కానీ ఆ యువకుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రితో పాటు అతని సోదరుడు జలసమాధి అయ్యారు.

two died in pond
బుద్ధిగా ఉండాలని మందలించినందుకు... ఆ యువకుడు ఏం చేశాడంటే
author img

By

Published : Apr 15, 2022, 10:00 AM IST

బుద్ధిగా ఉండాలని మందలించినందుకు... ఆ యువకుడు ఏం చేశాడంటే

two died in pond: తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెంలో విషాదం చోటు చేసుకుంది. బుద్ధిగా ఉండాలని మందలించినందుకు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, అతని సోదరుడు మృతి చెందారు.

గ్రామానికి చెందిన విజేందర్‌.. తన కుమారుడు శ్రవణ్‌ను అల్లరి పనులు మాని.. బుద్ధిగా ఉండాలంటూ మందలించాడు. మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లోంచి వెళ్లి.. చనిపోతానంటూ తండ్రి, అతడి పెదనాన్న కుమారుడికి ఫోన్​ చేసి బెదిరించాడు. చెరువులో దూకుతానని భయపెట్టడంతో.. తండ్రి విజేందర్‌, అతడి అన్న కుమారుడు శోభన్‌తో కలిసి చెరువు గట్టుకు వెళ్లారు. వారి ముందే శ్రవణ్‌ చెరువులో దూకడంతో.. ఏమీ ఆలోచించకుండా వారిద్దరూ చెరువులో దూకారు. కానీ.. కన్నపేగును కాపాడుకుందామన్న ఆ తండ్రి తపన.. సోదర బంధాన్ని నిలబెట్టుకుందామనుకున్న ఆ అన్న ప్రయత్నం.. ఇరువురి ప్రాణాలనూ బలి తీసుకుంది.

అతడు సేఫ్​.. కానీ వారిద్దరూ..! : చెరువులో దూకిన శ్రవణ్ తనకు ఈత రావడంతో.. ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ అతడిని కాపాడేందుకు చెరువులో దూకిన తండ్రి, సోదరుడు.. ఈత రాక చెరువులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలారు. యువకుడి అనాలోచిత, ఆకతాయి బెదిరింపులు.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఒకే రోజు ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.