జులై 1వ తేదీన 104, 108 నూతన వాహనాలను విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, సీఎం సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ట్రాఫిక్ ఆంక్షల వివరాలను సీపీ బి.శ్రీనివాసులు వెల్లడించారు.
- చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, విశాఖపట్నానికి వెళ్లే వాహనాలు... ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద నుంచి - బాపట్ల- అవనిగడ్డ - చల్లపల్లి- పామర్రు- గుడివాడ- హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వైపునకు వెళ్లాలి
- గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి లారీలు / భారీ వాహనాలకు అనుమతి లేదు
- విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే భారీ వాహనాల్ని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి గుడివాడ- పామర్రు- చల్లపల్లి- అవనిగడ్డ మీదుగా పంపిస్తారు.
- బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు రెండు వైపులా ఏ విధమైన వాహనాల రాకపోకలకు అనుమతి లేదు
- గుంటూరు వైపు నుంచి విజయవాడ, ఏలూరు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లను.. వారధి- పాత కృష్ణలంక పోలీసు స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడ నగరంలోకి అనుమతిస్తారు
- ఏలూరు వైపు నుంచి గుంటూరు వైపునకు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లు రమేశ్ హాస్పిటల్ నుంచి గురునానాక్ నగర్ రోడ్డు- ఫన్ టైమ్ క్లబ్ రోడ్డు - పంట కాలువ రోడ్డు- ఎన్టీఆర్ సర్కిల్- కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్ - రామలింగేశ్వర్ నగర్- స్కూ బ్రిడ్జ్- వారధి మీదుగా వెళ్లాలి
- మచిలీపట్నం వైపు నుంచి గుంటూరు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లు బందరు రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్- కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్- రామలింగేశ్వర్ నగర్- స్క్రూ బ్రిడ్జ్ వారధి మీదుగా వెళ్లాలి
- మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలను ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి- పంట కాలువ - ఏపీఐఐసీ కాలనీ రోడ్డు - గురునానక్ నగర్ రోడ్డు - రమేశ్ హాస్పిటల్ నుంచి విజయవాడ నగరంలోకి అనుమతిస్తారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు మార్గములు
- ఏలూరు వైపు నుంచి విజయవాడ వచ్చే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి - ఏలూరు రోడ్డు- గుణదల చుట్టుగుంట- దీప్తి జంక్షన్- అప్సరా జంక్షన్ - ఆర్టీసీ వై జంక్షన్ - పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి పీఎన్బీఎస్కు వెళ్లాలి
- మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వచ్చే ఆర్టీసీ బస్సులు తాడిగడప- ఆటోనగర్ 100 అడుగులు రోడ్డు - మహానాడు రోడ్డు- రామవరప్పాడు రింగ్ - ఏలూరు రోడ్డు - గుణదల - చుట్టుగుంట- దీప్తి జంక్షన్ - అప్పరా జంక్షన్- ఆర్టీసీ వై జంక్షన్ - పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి పీఎన్బీఎస్కు వెళ్లాలి