- Amaravathi farmer paada yatra: మరింత జోరుగా మహాపాదయాత్ర.. అడుగడుగనా జన నీరాజనం
అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర.. ఇవాల్టికి ముగిసింది. యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద పాదయాత్ర ఆగింది. రైతులు ఇవాళ(శుక్రవారం), రేపు(శనివారం) అక్కడే బస చేయనున్నారు. రేపు విరామం దృష్ట్యా... తిరిగి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభం(sunday morning) కానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- MINISTER PERNI NANI: బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తెలియదు: పేర్ని నాని
ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ఇటీవల నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఆ తర్వాత వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PRC: పీఆర్సీపై రాని స్పష్టత..జేఎస్సీ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు
వేతన సవరణ నివేదిక సహా డిమాండ్లపై..ఉద్యోగ సంఘాలకు మరోసారి నిరాశే ఎదురైంది. పీఆర్సీ (PRC) నివేదికను ప్రభుత్వం కావాలనే బహిర్గతం చేయకుండా..మానసిక క్షోభకు గురి చేస్తోందంటూ ఉద్యోగ సంఘాలు ఉన్నతాధికారుల సమావేశాన్ని అర్థాంతరంగా బహిష్కరించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- heavy rains: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న జలాశయాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోత వానలు(heavy rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదక స్థితికి చేరాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశ ఆర్థికానికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ కీలకం: మోదీ
రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిన రెండు వినూత్న పథకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వీటితో దేశంలో పెట్టుబడుల పరిధి మరింత విస్తరిస్తుందన్నారు. మూలధన మార్కెట్ వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- హిందూ మతం, హిందుత్వం.. ఈ రెండూ వేరు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ చేపట్టిన డిజిటల్ కార్యక్రమం 'జన్ జాగరణ్ అభియాన్'ను(jan jagran abhiyan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi news). ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. హిందూ మతం, హిందుత్వం.. రెండు వేర్వేరు విషయాలన్నారు(congress party news today). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చైనాపై అమెరికా దూకుడు- తైవాన్ తరఫున వకాల్తా
అఫ్గాన్‌లో ఇటీవలే బలగాలను ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం తాజాగా తైవాన్‌పై దృష్టిని మరల్చింది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ రక్షణకు రంగంలోకి దిగుతామని చెబుతోంది. అమెరికా దూకుడు చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉదంతాలు ఎలాంటి పరిణామాల దిశగా సాగుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సీఎంలతో సోమవారం నిర్మల కీలక భేటీ- అజెండా ఇదే...
ఈనెల 15న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. ప్రైవేటు పెట్టుబడుుల పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- న్యూజిలాండ్‌లో టీమ్ఇండియా పర్యటన.. దానికోసమే!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది భారత మహిళల జట్టు. 2022 మార్చి-ఏప్రిల్‌లో ప్రపంచకప్ (Women's Cricket World Cup) జరగనున్న నేపథ్యంలో సన్నాహకంలో భాగంగా 5 వన్డేలు, ఓ టీ20 ఆడనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్.. తమన్ క్లారిటీ
మెగాస్టార్ 'గాడ్‌ఫాదర్'(chiranjeevi godfather cast) చిత్రంలో కండలవీరుడు సల్మాన్(salman khan movies) నటిస్తున్నారు. ఈ విషయాన్ని తమన్ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేయనున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.