ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

.

today top news in andhrapradesh
today top news in andhrapradesh
author img

By

Published : Aug 25, 2020, 3:00 PM IST

  • స్వర్ణప్యాలెస్‌ మృతుల కుటుంబీకులకు పరిహారం అందజేత
    స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం అందించింది. మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున చెక్కుల‌ను అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శిరోముండనం కేసుపై కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ
    తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం కేసు గురించి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్​కు... తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఆ కేసు గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని లేఖలో పేర్కొన్నారు. బాధితుడు రాష్ట్రపతికి మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చెత్తకుప్పలో పసికందు
    కళ్లయినా తెరవని ఓ పసికందు తల్లి ఒడికి దూరమైంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి చెత్తకుప్పలో గుక్కపట్టి ఏడుస్తుండగా స్థానికులు అక్కున చేర్చుకున్నారు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
    ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలోని అన్ని రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్‌లో రెండోదశకు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌
    కొవిడ్​-19 టీకాపై ఆశలు రేపుతున్న ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ రెండో దశ క్లినికల్​ ట్రయల్స్.. మంగళవారం భారత్​లో ప్రారంభం కానున్నాయి. పుణెలోని భారతి విద్యాపీఠ్​ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఈ ప్రయోగాలను నిర్వహించనుంది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇది ఒక పోస్ట్ గురించి కాదు.. దేశం గురించి'
    కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ మార్పు అన్నది దేశం కోసం తప్ప పదవి కోసం జరిగే వ్యవహారం కాదని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. ఈ మేరకు కపిల్​ సిబల్​ చేసిన ట్వీట్​ కాంగ్రెస్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రశాంత్ ‌భూషణ్‌ కేసు మరో ధర్మాసనానికి బదిలీ
    న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. అయితే త్వరలో తాను పదవీ విరమణ చేస్తున్నందున కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్​ అరుణ్​ మిశ్రా తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉత్తర కొరియా నాయకుడి​ మిస్టరీ 'అణు'మానాలు
    ఉత్తర కొరియా నాయకుడు కిమ్​ జోంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా ఆయన ఏం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ఆయన కొన్నాళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించడం మానేశారు. దీంతో కిమ్‌ కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ మెల్లిగా అధికార దండాన్ని అందుకొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ క్యాపిటల్స్​ కొత్త బౌలింగ్​ కోచ్​గా హ్యారిస్​​
    ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు నూతన బౌలింగ్​ కోచ్​ను నియమించింది ఆ జట్టు యాజమాన్యం. ఆస్ట్రేలియా మాజీ పేసర్ రియాన్​​​ హ్యారిస్​​ను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేసింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది బృందంతో కలవడని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుశాంత్​ మృతిపై అధ్యయనానికి ​డాక్టర్ల బృందం
    బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఆల్​ఇండియా ఇనిస్టిట్యూట్​ ఫర్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​). హీరో మృతికి సంబంధించిన పోస్టుమార్టమ్ నివేదికతో పాటు మరణానికి కారణమైన అంశాలను ఈ బృందం అధ్యయనం చేస్తుందని ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ విభాగాధిపతి సుధీర్​ గుప్తా పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.