రాష్ట్రంలో ఎస్సీల పట్ల వైకాపా ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎస్సీ విద్యార్థి నాయకుడు దొండపాటి విజయ్ అక్రమ అరెస్టుతో అర్థమవుతోందని.. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ విజయవాడ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ, ఎస్సీ విద్యార్థి సంఘం నాయకుడు విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఈ చర్యలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యవసర పరిస్థితైతే తప్ప అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు పదే పదే చెప్పినప్పటికీ.. వాటిని పెడచెవినపెట్టి వ్యవహరించడం దారుణమన్నారు. దొండపాటి విజయ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
జబ్బుల నుంచి రక్షణగా రుచికరమైన పండ్లు
ధాన్యం ఎప్పుడు కొంటారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం నేరమా?: నారా లోకేశ్