ETV Bharat / city

'రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు'

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ప్రజలు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిపై వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్
వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్
author img

By

Published : Mar 5, 2020, 11:51 PM IST

కరోనా వైరస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు 0866-2410978 కు తెలియజేయాలని కోరారు. కొవిడ్-19 లక్షణాలేమైనా ఉంటే వెంటనే మాస్క్​ను ధరించాలన్నారు. సమీప ప్రభుత్వాసుపత్రికి ఉచిత 108 అంబులెన్స్​లో చేరుకోవాలని సూచించారు.

ఇప్పటి వరకు 361 మంది వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 130 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉండగా.. 218 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తయ్యిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు. 24 మంది శాంపిళ్లను ల్యాబ్​కు పంపగా 11 మందికి నెగటివ్​గా తేలిందన్నారు. మిగతా 13 మంది శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

కొవిడ్ -19 నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదు కాలేదని స్పష్టం చేశారు. విదేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదీచదవండి

'కరోనా వైరస్​ను వంద శాతం దూరం చేయవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.