రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని.. పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావటంతో.. రాష్ట్రంలో కూడా అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. అటవీశాఖ అధికారులతో బర్డ్ శాంక్చురీపై నిఘా పెట్టామన్నారు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఫ్లూ వైరస్ సోకే అవకాశముందన్నారు.
పక్షులు అకస్మాత్తుగా మృతిచెందుతున్నా, కన్ను ,ముక్కుల నుంచి నీరు కారుతున్నా తమకు సమాచారమివ్వాలని అటవీశాఖ అధికారులను సూచించినట్లు ఆయన తెలిపారు. అనుమానిత లక్షణాలు కనపడితే.. పక్షుల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపుతామన్నారు. బర్డ్ ఫ్లూ రాష్ట్రంలో లేదని.. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:
ఆస్తి కోసం తల్లికి తలకొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిన కుమారుడు